కవితాశరాలు
కవితాబాణాలు
పట్టుకుంటా
మదులమీదకు
వదులుతా
అంబును
ఎక్కుపెడతా
అక్షరాలను
వదులుతా
పదాలశరాలను
ప్రయోగిస్తా
అర్ధాలను
స్ఫురింపచేస్తా
స్వరశస్త్రాలను
విడుదలజేస్తా
రాగాలను
పలికిస్తా
విల్లును
ధరిస్తా
విషయాలను
సంధిస్తా
ధనస్సు
చేబడతా
ధ్వనులను
చెవులకుచేరుస్తా
గుండెలకుచాపాలు
గురిపెడతా
మదులను
మురిపింపజేస్తా
ఆలోచనాస్త్రాలను
సారిస్తా
అంతరంగాలను
అలరిస్తా
అమ్ములపొదిని
ధరిస్తా
కమ్మనికవితలను
చేరుస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment