దేహాలయం
దేహం
ఒక ఆలయం
జీవం
ఒక దైవం
దేహం
ఒక వాహనం
పయనం
దాని లక్షణం
దేహం
ఒక సాధనం
మోక్షం
దాని ఆశయం
దేహం
ఒక వరం
సువినియోగం
ఆవశ్యకం
దేహం
అద్భుతమైనశిల్పం
ముచ్చటైనరూపం
అనూరాగాలనిలయం
దేహం
ఎదిగేపదార్ధం
పెరగటం
దాని స్వభావం
దేహం
ఒక అందం
ఆనందం
దాని గమ్యం
దేహము
ఒక గృహము
అంతరాత్మకు
అది ఆవాసము
దేహం
అంగాలసముదాయం
ఆరోగ్యం
దానికత్యంతప్రాధాన్యం
దేహం
అస్తిపంజరం
కండల
సముదాయం
దేహం
గాయపడితే
విలపిస్తుంది
రోగమొస్తే
తపిస్తుంది
దేహం
ప్రేమను
కోరుకుంటుంది
తోడును
ఆశిస్తుంది
దేహం
స్నేహం
కావాలంటది
సహకారం
ఇచ్చిపుచ్చుకుంటుంది
దేహం
అశాశ్వతం
జీవితం
కాలపరిమితం
వృధ్యాప్యం
దేహలక్షణం
మరణం
దేహంతకం
ప్రాణముంటేజీవం
పోషణాత్మకం
ప్రాణంపోతేశవం
దహనాత్మకం
దేహాన్ని
శుద్ధిగాయుంచు
జీవితాన్ని
బుద్ధిగాగడుపు
ఓ దేహీ
బ్రతికినంతకాలము
చెయ్యిపుణ్యము
జీవితాంతమందు
చేరుస్వర్గము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment