ఓ సఖీ!
కలసి నడుద్దాం
మనం కలసినడుద్దాం
ముందుకు నడుద్దాం
మనం ముందుకునడుద్దాం
తోడుగ నడుద్దాం
మనం తోడుగనడుద్దాం
జోడుగ నడుద్దాం
మనం జోడుగనడుద్దాం ||కలసి||
ఓనా సఖీ
ఓనా ప్రియా
ఓనా తోడా
ఓనా నీడా
ఓనా ప్రాణమా
ఓనా భాగ్యమా
ఓనా అందమా
ఓనా ఆనందమా ||కలసి||
చేతులు కలుపుకుందాం
మనసులు కలుపుకుందాం
అన్యోన్యంగా జీవిద్దాం
ఆనందంగా జీవిద్దాం
జతగా నిలుద్దాం
జంటగా నడుద్దాం
జల్సాగా నడుద్దాం
జబర్దస్తుగా నడుద్దాం ||కలసి||
కలలను నెరవేర్చుకుందాం
కోరికలను తీర్చుకుందాం
అందాలను కలసిచూద్దాం
ఆనందాలను కలసిపొందుదాం
ఎవరూలేని చోటుకువెళ్దాం
ఏకాంతమైన చోటుకువెళ్దాం
ఎప్పుడు వెళ్ళనిచోటుకెళ్దాం
ఎదురులేనిచోటుకు వెళ్దాం ||కలసి||
పూదోటకు వెళ్దాం
పువ్వులను చూద్దాం
పరిమళాలు పీలుద్దాం
ప్రణయంలో మునిగిపోదాం
ఆరుబయటకు వెళ్దాం
వెన్నెలలో విహరిద్దాం
తారకలతో మాట్లాడుదాం
మేఘాలతో ముచ్చటిద్దాం ||కలసి||
స్వర్గందాకా వెళ్ళొద్దాం
దేవతలను చూచొద్దాం
అమృతాన్ని త్రాగొద్దాం
అమరత్వాన్ని పొందొద్దాం
చిరునవ్వులు చిందుదాం
సరసాలు ఆడుదాం
సరాగాలు పాడుదాం
సంతసంగా గడుపుదాం ||కలసి||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment