ఓ మంచిమిత్రమా!


కళ్ళను

మెరిపించు

కర్ణాలను

మెప్పించు


మోమును

నవ్వించు

మదిని

మురిపించు


అందాలు

చూపించు

ఆనందాలు

అందించు


పూలను

పూయించు

పరిమళాలు

వీయించు


పలుకుల

తేనెలచిందు

పెదవుల

అమృతంక్రోలించు


వెన్నెల

కురిపించు

హాయిని

కలిగించు


ముందుకు

నడిపించు

శిఖరాలకు

చేర్పించు


దారులు

చూపించు

గమ్యాలను

చేర్పించు


ఆలోచనలు

రేకెత్తించు

అనుభూతులు

పొందనివ్వు


భావనలు

పుట్టించు

గుండెలను

కదిలించు


క్షేమము

కాంక్షించు

కూరిమిని

కొనసాగించు


సలహాలు

ఇవ్వు

సమస్యలు

తీర్చు


ప్రాణమిత్రులుగా

నిలిచిపోదాం

ప్రేమాభిమానాలతో

పరిఢవిల్లుదాం


స్నేహవిలువలు

చాటుదాం

చెలిమిబంధాలు

సాగిద్దాం


అందరికి

ఆదర్శంగానిలుద్దాం

కలసిమెలసి

ప్రపంచాన్నిజయిద్దాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog