సాహిత్యవనం


ఓ పువ్వు

పిలిచింది

ఓ నవ్వు

విసిరింది


ఓ ప్రేమ

చూపింది

ఓ ముద్దు

కోరింది


ఓ దృశ్యం

కనబడింది

ఓ విషయం

ఇచ్చింది


ఓ అందం

ఆకర్షించింది

ఓ ఆనందం

అందించింది


ఓ మోము

వెలిగింది

ఓ స్పందన

కోరింది


ఓ ఊహ

తట్టింది

ఓ ఆశ

లేపింది


ఓ భావన

సృజించింది

ఓ భ్రాంతి

స్ఫురించింది


ఓ కలము

చేతికొచ్చింది

ఓ కాగితము

నింపింది


ఓ కవిత

పుట్టింది

ఓ వెలుగు

చిమ్మింది


ఓ కవి

వెలుగువెలిగాడు

ఓ ఖ్యాతి

అందుకున్నాడు


ఇది 

కవితలకాలం

ఇది

కవులకాలం


ఇది

సమ్మేళనాలకాలం

ఇది

సత్కారాలకాలం


ఇది

కవిత్వలోకం

ఇది

సాహిత్యవనం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం




Comments

Popular posts from this blog