ఓ తెలుగోడి తపన!
వేడుకుంటున్నా
చేతులుపట్టుకొని
చెయ్యొద్దురా
తెలుగుకుహాని
బ్రతిమిలాడుతున్నా
గడ్డంపట్టుకొని
కొనసాగించకురా
తెలుగుకుకీడుని
ప్రార్ధిస్తున్నా
దండంపెట్టి
నిందించకురా
తెలుగుభాషని
సవినయంగా
విన్నవించుకుంటున్నా
సాగించకురా
తెలుగుపైద్వేషము
ప్రోత్సహించకురా
పరాయిభాషను
తక్కువచేయకురా
తల్లితెలుగును
వాడొద్దురా
ఆంగ్లపదాలను
చేయ్యొద్దురా
తెలుగుహత్యను
కోరుతున్నా
గట్టిగా గళమెత్తి
తేవొద్దురా
తెలుగుకు అపకీర్తిని
ప్రాధమిక
పాఠశాలల్లో
తప్పనిసరిచేయరా
తెలుగుమాధ్యమాన్ని
పడకురా
పరాయిమోజునందు
వదలకురా
తెలుగుచదువులును
నిర్బంధము
చెయ్యరా
తెలుగుభాషను
తెలుగుప్రాంతాల్లో
తెలుసుకోరా
మాతృభాషను తృణీకరిస్తే
స్వంతతల్లిని
నిరాదరణకు గురిచేసినట్లే
కాచుకోరా
కన్నతల్లిని
కాపాడుకోరా
తెలుగుతల్లిని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment