సరికొత్తగా వ్రాయాలనుకుంటున్నా!


కొత్తగా

కమ్మగా

కోమలంగా

వ్రాయాలనుకుంటున్నా!


అద్భుతంగా

అద్వితీయంగా

అలరించేలాగా

వ్రాయాలనుకుంటున్నా!


రసవత్తరంగా

రమణీయంగా

రకరకాలుగా

వ్రాయాలనుకుంటున్నా


తీపిగా

ప్రీతిగా

యుక్తిగా

వ్రాయాలనుకుంటున్నా!


సూక్షంగా

సరళంగా

సక్రమంగా

వ్రాయాలనుకుంటున్నా!


విన్నూతనంగా

విభిన్నంగా

వైవిధ్యంగా

వ్రాయాలనుకుంటున్నా!


అందంగా

ఆహ్లాదంగా

ఆత్మీయంగా

వ్రాయాలనుకుంటున్నా!


అర్ధమయ్యేలా

ఆలోచింపజేసేలా

అంతరంగాన్నితట్టేలా

వ్రాయాలనుకుంటున్నా!


శ్రావ్యంగా

సౌరభంగా

సృజనాత్మకంగా

వ్రాయాలనుకుంటున్నా!


కళాత్మకంగా

కవితాత్మకంగా

కవ్వించేలాగా

వ్రాయాలనుకుంటున్నా!


పోలికలతో

ప్రాసలతో

పదప్రయోగాలతో

వ్రాయాలనుకుంటున్నా!


భావత్మకంగా

రసాత్మకంగా

అర్ధవంతంగా

వ్రాయాలనుకుంటున్నా!


మనసునుముట్టేలా

గుండెనుతట్టేలా

హృదిననిలిచేలా

వ్రాయాలనుకుంటున్నా!


ఆస్వాదించేలా

ఆనందించేలా

అభినందించేలా

వ్రాయాలనుకుంటున్నా!


అలా వ్రాయాలని

అక్షరాలు అడుగుతున్నాయి

పదాలు ప్రార్ధిస్తున్నాయి

వస్తువులు వెంటబడుతున్నాయి


అలా వ్రాయమని

కలము కోరుతున్నది

కాగితము వేడుకుంటుంది

కవిత కవ్విస్తున్నది


అలా వ్రాయాలని

మనసు ముచ్చటపడుతున్నది

కోరిక వెంటబడుతున్నది

భావము బ్రతిమాలుచున్నది


అలా వ్రాసి

జన్మను ధన్యముచేసుకుంటా

చరిత్రపుటల్లో నిలిచిపోతా

శాశ్వతస్థానము పొందుతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog