అంతా భ్రాంతియేనా!


గాలి

మెల్లగావీస్తుంది

శబ్దాలను

మోసుకొనివస్తుంది


పాట

వినబడుతుంది

ఆట

ఆడిస్తుంది


మేను

నాట్యంచేస్తుంది

ఎద

ఆనందపడుతుంది


చేతులు

తాళంవేస్తున్నాయి

కాళ్ళు

చిందులుత్రొక్కుతున్నాయి


గొంతు

తియ్యగాఉంది

మనసు

తృప్తిపడుతుంది


భావం

బాగున్నది

అర్ధం

తలకెక్కుతుంది


హీరో

స్టెప్పులేస్తున్నట్లుంది

హీరోయిన్

సైడునయెగురుతున్నట్లుంది


ఆడియో

వినబడుతున్నట్లుంది

వీడియో

కనబడుతున్నట్లుంది


రీలు

తెగినట్లుంది

సీను

కట్టయినట్లుంది


ట్రాన్సుఫార్మరు

ప్రేలినట్లుంది

ఎలెక్ట్రిసిటి

పోయినట్లుంది


శబ్దం

ఆగిపోయినట్లుంది

బొమ్మ

కనుమరగయినట్లుంది


లయ

తప్పినట్లుంది

మది

మేలుకున్నట్లుంది


అక్షరాలు

అల్లుకున్నట్లుంది

పదాలు

అమరినట్లుంది


కవిత

తయారయినట్లుంది

పాఠకులకు

చేరవేసినట్లుంది


ఊహలలో

మునిగినట్లుంది

భ్రమలలో

పడిపోయినట్లుంది


కవిత్వం

కల్పనలేనా

సహజత్వం

శూన్యమేనా


అంతా

భ్రాంతియేనా

మనమంతా

ఇంతేనా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog