రావా!
(ఓ కవిత్వమా)
రావా
సీతాకోక చిలుకలా
పచ్చని శుకములా
మొగ్గతొడిగిన మొక్కలా
రావా
పురివిప్పిన నెమలిలా
గళమెత్తిన కోకిలలా
ఒయ్యారి హంసనడకలా
రావా
ఆప్యాయంగా
అందంగా
ఆనందంగా
రావా
విరిసిన పువ్వులా
వాన చినుకులా
రంగుల హరివిల్లులా
రావా
రవికిరణంలా
శశివెన్నెలలా
తారతళుకులా
రావా
ప్రియమైన పలకరింపుతో
తియ్యనైన మాటలతో
శ్రావ్యమైన గళముతో
రావా
ముచ్చటగా
ముద్దుగా
మురిపముగా
రావా
కళ్ళకు సొంపుగా
చెవులకు ఇంపుగా
వంటికి ఒప్పుగా
రావా
ఆటలా
పాటలా
మాటలా
రావా
అలోచనగా
భావముగా
విషయముగా
రావా
కలంగా
కాగితంగా
కవిత్వంగా
రావా
పద్యంగా
పాటగా
కవితగా
రావా
గుండెను తాకేలాగా
హృదిని ముట్టేలాగా
మనసును దోచేలాగా
రావా
తోడుగా ఉండటానికి
నీడగా నిలవటానికి
ఘనంగా జీవింపజేయటానికి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment