కవనతతంగం
కాలచక్రం
తిరుగుతుంది
సమయము
చాలకున్నది
డబ్బులు
ఖర్చవుతున్నాయి
జేబులు
ఖాళీయవుతున్నాయి
సరుకులు
నిండుకుంటున్నాయి
త్వరగాతెచ్చి
నింపమంటున్నాయి
ప్రేమలు
తరగిపోతున్నాయి
ద్వేషాలు
పెరిగిపోతున్నాయి
కానీ
అక్షరాలు
అడగకుండా అందుబాటులోకొస్తున్నాయి
పదాలు
పరుగెత్తుకుంటు ప్రక్కకొస్తున్నాయి
ఆలోచనలు
ఆగకుండా ఊరుతున్నాయి
భావాలు
బయటపెట్టమని గోలచెస్తున్నాయి
కవిత్వము
సెలయేరులా సాగిపోతుంది
సాహిత్యము
పుటల్లో నిలిచిపోతుంది
పాఠకులు
ప్రతిదినము చదువుతున్నారు
విమర్శకులు
అద్భుతంగా మెచ్చుకుంటున్నారు
వాగ్దేవి
వాక్కులిస్తుంది
సాహితి
స్ఫూర్తినిస్తుంది
హయగ్రీవుడు
ఙ్ఞానాన్నిస్తున్నాడు
బ్రహ్మదేవుడు
సృజనచేయిస్తున్నాడు
కవనానికి
సిద్ధం
కవితలకి
స్వాగతం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment