ఎందుకు వివక్ష?
కొందరు
నవ్వుతుంటారు
కొందరు
ఏడుస్తుంటారు
కొందరు
వండుతారు
కొందరు
తింటారు
ఒకరిదేమో
సొమ్ము
వేరొకరిదేమో
సోకు
ఒకరికేమో
సుఖము
వేరొకరికేమో
కష్టము
ఒకరేమో
చెబుతారు
ఒకరేమో
వింటారు
ఒకరిదేమో
పెత్తనము
ఒకరిదేమో
బానిసత్వము
ఒకరేమో
సంపాదిస్తారు
వేరొకరేమో
ఖర్చుబెడతారు
కొందరు
పాలిస్తారు
కొందరు
పాలింపబడతారు
కొందరు
నేతలు
కొందరు
అనుచరులు
కొందరు
నాయకులు
కొందరు
వినాయకులు
కొందరు
శూరులు
కొందరు
భీరులు
కొందరు
పండితులు
కొందరు
శుంఠలు
కొందరు
శాసిస్తారు
కొందరు
అనుసరిస్తారు
కొందరు
బుద్ధిమంతులు
కొందరు
ఙ్ఞానహీనులు
ఒకరిదేమో
అందం
ఒకరిదేమో
ఆనందం
ఒకరేమో
రాస్తారు
ఒకరేమో
పాడతారు
ఎందుకు
వివక్ష
ఎవరు
కారణం
గుండ్లల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment