ఎవ్వరో?
ఎవరో
వీపుతడుతున్నారు
పొద్దుపొడవకముందే
మేల్కొలుపుతున్నారు
ఎవరో
మాటలుచెబుతున్నారు
మంచితలపులను
మెదడుకెక్కిస్తున్నారు
ఎవరో
పురమాయిస్తున్నారు
పనిలోనికి
దించుతున్నారు
ఎవరో
కవ్విస్తున్నారు
కార్యాన్ని
అప్పగిస్తున్నారు
ఎవరో
ఉత్సాహపరుస్తున్నారు
ఉల్లాన్ని
ఊగిసలాడిస్తున్నారు
ఎవరో
తొందరపెడుతున్నారు
తాత్సారము
చెయ్యొద్దంటున్నారు
ఎవరో
అందాలనుకనమంటున్నారు
అందరిని
ఆస్వాదింపజేయమంటున్నారు
ఎవరో
ఆనందపరుస్తున్నారు
అందరికి
పంచిపెట్టమంటున్నారు
ఎవరో
గొంతుసవరించుకోమంటున్నారు
గళాన్ని
గట్టిగావినిపించమంటున్నారు
ఎవరో
పెదవులనుతెరవమంటున్నారు
పలుకులను
తియ్యగాచిందించమంటున్నారు
ఎవరో
దారిచూపుతున్నారు
గమ్యానికి
తీసుకెళ్తున్నారు
ఎవరో
ఆఆగంతకుడు
అతనికి
ధన్యవాదాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment