నా కివ్వవా!
నా కివ్వవా!
ఓ గిలిగింత
పలుకరింత
పులకరింత
కవ్వింత
నా కివ్వవా!
ఓ ప్రేమ పలుకు
తీపి పలుకు
నచ్చే పలుకు
మెచ్చే పలుకు
నా కివ్వవా!
ఓ ఇంపు
సొంపు
జలదరింపు
కలవరింపు
నా కివ్వవా!
ఓ చక్కదనము
తియ్యదనము
కమ్మదనము
తేటదనము
నా కివ్వవా!
ఓ అందమైన చూపు
మదినిముట్టే చూపు
మరచిపోలేని చూపు
మధురమైన చూపు
నా కివ్వవా!
ఓ చిత్రమైన నవ్వు
పువ్వులాంటి నవ్వు
ప్రకాశించే నవ్వు
పరవశపరచే నవ్వు
నా కివ్వవా!
ఓ గుబులులేపేముద్దు
గుర్తుండిపోయే ముద్దు
వయ్యారాల ముద్దు
తియ్యనైన ముద్దు
నా కివ్వవా!
ఓ ఇష్టమైన కబురు
సంతసపరచే కబురు
కలకాలమునిలిచే కబురు
కేరింతలుకొట్టించే కబురు
నా కివ్వవా!
ఓ వాత్సల్యభరిత స్పర్శ
అణువణువూతట్టే స్పర్శ
మైమరిపించే స్పర్శ
మమకారంచిందే స్పర్శ
నా కివ్వవా!
ఓ మంచి సమయం
ఆనంద సమయం
ఏకాంత సమయం
ఏమరచే సమయం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment