ఓ నాచెలీ!
(ఓ చిత్ర విచిత్రమా!)
ఎర్రచీర కట్టావని
ప్రమాదమని దూరంగాపోను
తెల్లచీరకట్టలేదని
దగ్గరకురాకుండా ఉండలేను
కళ్ళు మూసుకున్నావని
చిలిపిచేష్టలు చెయ్యను
కళ్ళు తెరుచుకోలేదని
కనపడకుండా మానను
జుట్టు విరబూసుకున్నావని
అందము తగ్గిందనుకోను
కొప్పు ముడివెయ్యలేదని
పూలివ్వటము మానను
చందమామ వెనుకున్నాడని
నీమోముకు సాటికాడనుకుంటాను
చందమామ ముందున్నా
నినుచూడక మాననేమానను
సాంబ్రాణి పొగవేసినా
నా దృష్టిమరల్చను
సాంబ్రాణి వెయ్యకపోయినా
నా కోరికనువీడను
నగలు లేవని
తక్కువచేయను
వగలు ఉన్నదని
ఉబలాటపడతాను
నవ్వులు చిందినా
ఇష్టపడతాను
నవ్వులు దాచినా
నష్టంలేదనుకుంటాను
నీ మదిలో
దేవుడున్నా ఇబ్బందిలేదు
నీ హృదిలో
నేనున్నా పరవాలేదు
ఎరుపుగా ఉన్నావని
వెర్రివాడనుకాను
నల్లగా ఉన్నా
ప్రేమించకమానను
అందంగా ఉన్నావని
పిచ్చివాడిగా వెంటబడను
కురూపిగా ఉన్నా
వదిలిపెట్టే ప్రసక్తేలేదు
నల్లబొట్టు పెడితే
దిష్టిచుక్కనుకుంటా
ఎరుపుబొట్టుపెడితే
సింధూరపుబొమ్మవనుకుంటా
కట్టూబొట్టూ చూసి
సంప్రదాయ స్త్రీవనుకుంటా
దైవభక్తి తెలసి
సుమతివి అనుకుంటా
ఇంకెందుకు ఇక
ఆలశ్యంచేయటం
వెనకడుగు వేయక
జతకట్టిముందుకెళ్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment