ఓ మనసా!


ఆలొచనారూపంలో

వస్తావు

ఓ వెలుగునిచ్చి

వెళ్తావు

ఓ ఆటను

ఆడించుతావు

ఎందుకొస్తావో

ఎప్పుడొస్తావో

ఎలామాయమవుతావో

అడిగితే చెప్పవుగదా!


అదృశ్యరూపంలో

ఉంటావు

గుండెను

ఆడిస్తుంటావు

దేహాన్ని

నడుపుతుంటావు

చెప్పకుండా

వస్తావు

చెప్పకుండానే

వెళ్తావు

అడిగితే చెప్పవుగదా!



ప్రొద్దున్నే 

మేనునుతట్టి

మేలుకొలుపుతావు

పనులకు

ఉసిగొలుపుతావు

రాత్రికి

చీకటినిచేసి

విశ్రాంతితీసుకోమని

వెళ్తావు

కాలచక్రాన్ని

ఎందుకుతిప్పుతావో చెప్పవుగదా!


నిలదీస్తే

నేనే

నువ్వంటావు

నువ్వే

నేనంటావు

ఇద్దరం

కలిసే ఉందామంటే

ఒప్పుకోవు

మూతిముడిచి

వెళ్ళిపోతావు

నాపై పెత్తనం

చలాయిస్తుంటావు

ఎందుకని అడిగితే చెప్పవుగదా!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog