ఎవరో చూడొస్తున్నారు?
ఎవరో
చూడొస్తున్నారు
ఏదో
చేసిపోతున్నారు
ఎవరో
వీస్తున్నారు
ఏవో
చూపిస్తున్నారు
ఏలనో
అదృశ్యంగాయున్నారు
ఎందుకో
అర్ధంకావటంలేదు
ఆలోచనలని
తలకెక్కిస్తున్నారు
అంతరంగాలని
తడుతున్నారు
చెట్లను
ఊపుతున్నారు
వచ్చామని
చాటుతున్నారు
సుగంధాలు
చల్లుతున్నారు
సంతోసించమని
చెబుతున్నారు
మాటలను
మోసకొస్తున్నారు
సమాచారమును
చేరవేస్తున్నారు
హోరుశబ్దము
వినిపిస్తున్నారు
తూఫానుని
సూచిస్తున్నారు
మేనును
ముడుతున్నారు
మనసును
మైమరపిస్తున్నారు
మేఘాలను
తరుముతున్నారు
ఆకాశాన్ని
కప్పుతున్నారు
జుట్టును
లేపుతున్నారు
సవరించుకోమని
హెచ్చరిస్తున్నారు
పడతుల
పయ్యెదలులేపుతున్నారు
పడుచుల
ఆటపట్టిస్తున్నారు
కళ్ళల్లో
దుమ్మునుచల్లుతున్నారు
చూచింది
ఇకచాలంటున్నారు
అదృశ్యగాలికి
వందనాలు
చాటింపులకి
ధన్యవాదాలు
పవనమా
స్వాగతము
గుండెనాడిస్తున్నందుకు
కృతఙ్ఞతలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment