కవితావిందులు
కవికి
అక్షరాలే
అన్నపు
మెతుకులు
కవికి
పదాలే
గోరు
ముద్దలు
కవికి
తలపులే
దప్పికతీర్చు
జలాలు
కవికి
అల్లికలే
కడుపు
నింపులు
కవికి
మాటలే
డబ్బుల
మూటలు
కవికి
అందాలే
అంతరంగ
అనుభూతులు
కవికి
కలమే
పదునైన
ఆయుధము
కవికి
కాగితమే
వడ్డించే
విస్తరాకు
కవికి
రంగులే
మనసుకు
పొంగులు
కవికి
పాటలే
ప్రాసల
నడకలు
కవికి
వస్తువే
వివాహ
భోజనము
కవికి
కవితలే
కన్యల
కవ్వింపులు
కవికి
వెలుగులే
కవన
కిరణాలు
కవికి
వడ్డనే
ప్రియమైన
కార్యము
కడుపునిండా
కొరికోరితినండి
కవిగారిని
కుతూహలపరచండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment