ఇంటికొచ్చిన అతిధులు


ఇంటికి

పూలొచ్చాయి

కంటికి

ఇంపునిచ్చాయి


ఆహ్వానించని

అతిధులొచ్చారు

అడగనటువంటి

ఆలోచనలిచ్చారు


గంపెడు

విరులొచ్చాయి

తట్టెడు

ఊహలులేపాయి


చక్కని

రూపాలుచూపాయి

చిక్కని

భావాలనిచ్చాయి


గట్టిగ

గాలివిసిరింది

ఘాటుగ

పరిమళమువీచింది


మీదన

మత్తుచల్లాయి

మదిని

చిత్తుచేశాయి


మాలగ

అల్లమన్నాయి

కొప్పులో

తురుమమన్నాయి


సొగసులు

చూడమన్నాయి

సంతసాలు

పొందమన్నాయి


కవితను

కూర్చమన్నాయి

నవ్యతను

చాటమన్నాయి


మనసులు

దోచమన్నాయి

మేనులను

ముట్టమన్నాయి


మదుల

మురిపించమన్నాయి

హృదుల

ఆకర్షించమన్నాయి


కాలమార్పుని

గమనించమన్నాయి

వసంతాన్ని

ఆస్వాదించమన్నాయి


కుసుమాలు

కవ్వించికదిలించాయి

కవనాలు

కాగితాలకెక్కించాయి


పర్యావసానము

కలముకదిలింది

ఫలితము

భావకైతపుట్టింది


కవితను

జుర్రుకోండి

కడుపును

నింపుకోండి


పారవశ్యము

పొందండి

పరమానందము

పంచండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog