ఎదురుచూపులు
నీ
పిలుపుకోసం
ఎదురుచూస్తున్నా
నీ
పలుకులకోసం
ప్రతీక్షిస్తున్నా
నీ
అందంకోసం
ఆరాటపడుతున్నా
నీ
ప్రేమకోసం
నిరీక్షిస్తున్నా
నీ
నగుమోముకోసం
నిలిచిచూస్తున్నా
నీ
అక్షరాలకోసం
కళ్ళుతెరుచుకొనియున్నా
నీ
పదాలకోసం
వేచియున్నా
నీ
భావాలకోసం
మనసుతెరిచిపెట్టియున్నా
నీ
బాగుకోసం
భగవంతునునిప్రార్ధిస్తున్నా
నీ
వృద్ధికోసం
కనిపెట్టుకొనియున్నా
నీ
వార్తలకోసం
చెవులుతెరచియున్నా
ఎప్పుడు
కరుణిస్తావో
ఎప్పుడు
చెంతకొస్తావో
నన్ను
నీటిలో
ముంచుతావో
తేలుస్తావో
నన్ను
ఏడిపిస్తావో
లేక
సంతసపరుస్తావో
వేచి
చూస్తా
లేచి
ఉంటా
నీ
ఇష్టం
నా
కర్మం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment