అతగాడి ఐదుకవితలు


అతగాడు 

రాసిన

మొదటికవిత

చదివా


పువ్వులను

పూయించాడు

పరిమళాలను

వెదజల్లాడు


నవ్వులను

కురిపించాడు

మోములను

వెలిగించాడు


అతగాడు

రాసిన

రెండవకైత

పఠించా


చక్కదనము

చూపించాడు

కమ్మదనము

కలిగించాడు


ఆనందం

అందించాడు

అంతరంగం

నింపేశాడు


అతగాడు

రాసిన

మూడవకయిత

పరిశీలించా


వెన్నెలను

వెదజల్లాడు

హృదయాన్ని

కదిలించాడు


మదిని

ఊగించాడు

హృదిని

పొంగించాడు


అతగాడు

రాసిన

నాల్గవకవనాన్ని

చూశా


తేనెచుక్కలు

చల్లాడు

తీపిరుచులు

చూపించాడు


తెలుగును

తల్లియన్నాడు

దేవతయన్నాడు

తేటయన్నాడు


అతగాడు

రాసిన

ఐదవకవిత్వాన్ని

ఆస్వాదించా


అమ్మను

దేవతన్నాడు

మూలమన్నాడు

శక్తియన్నాడు


తల్లిని

పూజించమన్నాడు

ప్రేమించమన్నాడు

సేవించమన్నాడు


అతడికవితలను

తలచుకుంటా

అంతరంగంలో

దాచుకుంటా


అతడిశిల్పమును

అద్భుతమంటా

అతనిశైలిని

అమోఘమంటా


అతడక్షరాలను

ముత్యాలంటా

అతనిపదాలను

రత్నాలంటా


ఆకవికి

జోహార్లు

ఆకవితలకి

జేజేలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog