పాఠకుల స్పందనలు
అవి
ప్రశంసలవర్షమా
కాదు
పూలజల్లులు
అవి
వానచినుకులా
కాదు
ప్రేమధారలు
అవి
ఇష్టాలా
కాదు
మెప్పులు
అవి
వ్యాఖ్యలా
కాదు
ఆనందాలు
అవి
పలకరింపులా
కాదు
అభినందనలు
అవి
ఆవేశాలా
కాదు
ఆత్మీయతలు
అవి
స్పందనలా
కాదు
మనోభావాలు
అవి
విమర్శలా
కాదు
పరామర్శలు
అవి
తాత్కాలికమైనవా
కాదు
శాశ్వతమైనవి
అవి
ముచ్చట్లా
కాదు
చప్పట్లు
అవి
కామిక్కులా
కాదు
టానిక్కులు
పాఠకలోకానికి
ధన్యవాదాలు
సాహిత్యలోకానికి
ప్రణామాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నా అక్షరాలు
పూస్తున్నాయని కొందరంటున్నారు
నా పదాలపరిమళాలు
వీస్తున్నాయని మరికొందరంటున్నారు
నా తలపులు
తనువులతట్టుతున్నాయని కొందరంటున్నారు
నా భావాలు
మదులముట్టుతున్నాయని మరికొందరంటున్నారు
నా అల్లికలు
అందాలుచూపుతున్నాయని కొందరంటున్నారు
నా కూర్పులు
ఆనందాన్నిస్తున్నాయని మరికొందరంటున్నారు
నా ప్రాసలు
అలరిస్తున్నాయని కొందరంటున్నారు
నా లయలు
కదిలిస్తున్నాయని మరికొందరంటున్నారు
నిత్యకైతలను
పాఠకులకు పంచాలనుకుంటున్నాను
సత్యకవితలను
కాగితాలపై కొనసాగించాలనుకుంటున్నాను
పాఠకులను
పరవశపరచాలని ప్రయత్నిస్తున్నాను
సాహితీప్రేమికులను
సంతసపరచాలని శ్రమిస్తున్నాను
రాళ్ళువేసినా
తట్టుకుంటాను తప్పుకుంటాను
పూలువిసిరినా
పట్టుకుంటాను పరవశించుతాను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment