నా చేయితగలగానే!
చిన్నగా
చేయిపెడితే
కొరివిలా
కాలుస్తుంది నిప్పురవ్వ
మెత్తగా
చేయిపెడితే
కోరిందలా
వ్రేలులోకిదిగుతుంది ముల్లకంప
ప్రేమగా
చేయిపెడితే
గులాబిముల్లులా
గుచ్చుతుంది రోజాపువ్వు
కోపంగా
చేయిపెడితే
పళ్ళతో
కొరుకుతుంది చిన్నారిపాప
నవ్వుతూ
చేయిపెడితే
సమయముకాదంటూ
కసురుకుంటుంది కన్యక
వెనుకగా
చేయిపెడితే
కోపపడి
విదిలించికుంటుంది సఖియా
కార్యక్రమంలో
చేయిపెడితే
కథ
అడ్డముతిరుగుతుంది అప్పటికప్పుడు
భయపడుతూ
చేయిపెడితే
బుసలుకొట్టి
పాములాకాటువేస్తుంది ప్రణయని
బుగ్గమీద
చేయిపెడితే
గగ్గోలుపెట్టి
గందరగోలముచేస్తుంది కోమలాంగి
నేను చేసుకున్న
పాపమేమి
నా చేతులుచేసిన
కర్మమేమి
కానీ కవితమాత్రము
నా చేయితగలగానే
అవుతుంది కుసుమము
కలిగిస్తుంది కమ్మదనము
కవితలకు
స్వాగతాలు
పాఠకులకి
ధన్యవాదాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment