నా మదిలో....
నా మదిలో
ఓ నది ప్రవహిస్తుంది
నురుగులు క్రక్కుతూ
సుడులు తిరుగుతూ
నా మదిలో
ఉన్నపళంగా
ఉరుములు ఉరుముతున్నాయి
మెరుపులు మెరుస్తున్నాయి
నా మదిని
నీరు ముంచేసింది
ఊపిరిసలపకుండా
ఉట్టిగానుండనీయకుండా
నా మదిలో
వరద పారుతుంది
అక్షరాలను లాక్కొని
పదాలాను పట్టుకొని
నా మదిలో
వాన కురుస్తుంది
చిటపటమంటూ
చిందులువేయిస్తూ
నా మదిలో
మబ్బులు తేలుతున్నాయి
ఆలోచనలను కూడగట్టుకొని
భావాలను ప్రోగుచేసుకొని
నా మదిని
తూఫాను క్రమ్మేసింది
ప్రచండంగా వీస్తూ
కుండపోతగా కురుస్తూ
నా మదిని
కవ్వం చిలుకుతుంది
కవితావెన్నను తీస్తూ
సాహితీసుధను త్రాగిస్తూ
నామదిలో
కవితాసేద్యం
చేయమంటారా
సాహిత్యపంటలను
పండించమంటారా
నా మదిలోని
నదాన్ని
బయటకు వదలమంటారా
నిలువునా ముంచేయమంటారా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment