ఆనందడోలికలు


పువ్వులపై గాలులతో

పరిమళాలు పరవశపరచవా


పెదవులపై నవ్వులతో

మోములు వెలుగులుచిమ్మవా


పలుకులపై తేనెచుక్కలతో

తెలుగు మాధుర్యమునివ్వదా


విరులపై తేటులతో

పూదోట పొంకాలుచూపదా


ఊయెలలపై ఊపులతో

శిశువులు ఆదమరచినిద్రపోరా


కొప్పులపై పూలతో

కోమలులు ఖుషీపరచరా


పడకపై సరసాలతో

పడతులు సయ్యాటలాడరా


వాహనాలపై ఊరేగింపుతో

ఉత్సవమూర్తులు వెలిగిపోరా


భూమిపై మొక్కలతో

పచ్చదనము కళ్ళనుకట్టెయ్యదా


ఆకాశంపై నీలిమేఘాలతో

నింగి నయనానందమివ్వదా


కడలిపై కెరటాలతో

చల్లనిగాలులు స్వేదతీర్చవా


మనసుపై ముద్రలతో

తీపిఙ్ఞాపకాలు నిలిచిపోవా


పుటలపై పదాలతో

కవితలు మదులనుతట్టవా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog