కవితార్పణం


కవిత

ఆనందం

కలిగించాలి


కయిత

అమృతం

చిందాలి


కైత

మనసులను

మురిపించాలి


ఈ కవితను

చూస్తున్నారుగా

చదువుతున్నారుగా


కొన్ని అక్షరాలు

కనపడుతున్నాయిగా

కవ్విస్తున్నాయిగా


కొన్ని పదాలు

ప్రకాశిస్తున్నాయిగా

పలుకరిస్తున్నాయిగా


కొన్ని అర్ధాలు

స్ఫురిస్తున్నాయిగా

మదినితడుతున్నాయిగా


ఆ కవిత్వం

నేనేకూర్చానుగా

నేనేపేర్చానుగా


ఆ కవనంపై

పరిమళాలు

చల్లానుగా


ఆ వ్రాతలకు

తియ్యదనాలు

అద్దానుగా


ఈ అల్లికపై

వెలుగులు

విరజిమ్మానుగా


ఈ  కైతపై

తేనెచుక్కలు

పూచానుగా


ఈ కవితకు

నేనే రూపకర్తను

నేనే భావకుడను


ఈ కవనం

నా సృష్టే

నా కృషే


ఈ కయితకు

కర్తనునేనే

కర్మనునేనే


ఈ కవిని

మళ్ళీమళ్ళీతలుస్తారుగా

మదిలోనిలుపుకుంటారుగా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog