కవనరంగం


అందాలు

ఆకర్షించి అలరించాలి

ఆనందాలు

అంతరంగాన్ని అలుముకోవాలి


పువ్వులు

పరిమళాలు చల్లాలి

నవ్వులు

నయనాలు చేరాలి


మాటలు

నిశ్శబ్దంలో వినపడాలి

మోములు

వెలుగులో కనిపించాలి


కలలు

కార్యంలోకి దించాలి

కాలము

కలసి రావాలి


తలపులు

తలలో ఊరాలి

భావనలు

బయటకు ఉరకాలి


అక్షరాలు

అందుబాటులోకి రావాలి

పదాలు

ప్రాసలతో పొసగాలి


కలాలు

ముందుకు కదలాలి

కాగితాలు

క్రమంగా నిండాలి


కవులు

కొత్తదనం చూపాలి 

కవితలు

కమ్మదనం కూర్చాలి


కవనపంటలు

పుష్కలంగా పండాలి

కవితాసిరులు

పుంఖానుపుంఖాలుగా కూడాలి


పాఠకులు

పఠించి పరవశించాలి

ప్రశంసలు

ప్రవాహములా సాగాలి


విషయాలు

విభిన్నముగా ఉండాలి

వ్రాతలు

విన్నూతనంగా వెలువడాలి 


కవనరంగము

కాంతులు వెదజల్లాలి

కవితలలోకము

కలకాలము వికసించాలి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog