కలంపట్టినకవిని
నేను
అందగాడినికాను
అగపడినవారిని
ఆకర్షించలేను
నేను
రవినికాను
కాంతికిరణాలను
వెదజల్లలేను
నేను
శశినికాను
చల్లనివెన్నెలను
కురిపించలేను
నేను
సుమాన్నికాను
సౌరభాలను
ప్రసరించలేను
నేను
మేఘాన్నికాను
చిటపటాచినుకులు
చిందించలేను
నేను
పూజారినికాను
పెళ్ళితంతును
నిర్వహించలేను
నేను
గురువునుకాను
సద్బోధనలను
ప్రవచించలేను
నేను
ఇంద్రజాలికుడినికాను
మాయలను
చేయలేను
నేను
ప్రాయాన్నికాను
పడుచుదనమును
పొంగించలేను
నేను
కడలికెరటాన్నికాను
ఎత్తుకెగరమని
క్రిందకుపడమనిచెప్పలేను
నేను
నదినికాను
పల్లానికినీరులా
ప్రవహించమనిచెప్పలేను
నేను
కల్పవృక్షాన్నికాను
కోరినకోర్కెలను
తీర్చలేను
కవినినేను
కవితలనుకూర్చగలను
కల్పనలుచేయగలను
భ్రములుకలిపించగలను
అందాలుచూపగలను
ఆనందాలుకలిగించగలను
మనసులనుముట్టగలను
గుండెలనుతట్టగలను
ఆకాశంలోయెగిరించగలను
వెన్నెలలోవిహరింపజేయగలను
మేఘాలతోముచ్చటింపజేయగలను
తారకలతోమాట్లాడించగలను
ఆలోచనలనులేపగలను
భావాలనుపుట్టించగలను
అర్ధాలనుస్ఫురింపజేయగలను
సాహిత్యజగతిలోసంచరింపజేయగలను
కవనలోకానికి
ఆహ్వానం
సాహితీలోకానికి
స్వాగతం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment