ఓ తెలుగోడి గోడు


తియ్యని తేనెలమాటలతో

తెలుగుతల్లికి మ్రొక్కెదమా

అమృతముచల్లే పలుకులతో

ఆంధ్రమాతను ఆరాధించెదమా


తెలుగుటికానా తలపులతో

తెలుగువెలుగులు చిమ్మెదమా

సర్కారుప్రాంత సహకారంతో

తెలుగుసొగసులు చాటెదమా


రాయలవారి స్ఫూర్తితో

రత్నాలమ్మిన గడ్డలో

తుంగభద్ర జలాలతో

తెలుగునేలన తేజరిల్లుదమా


గోదారి గలగలపరుగులతో

పాడిపంటలనే పెంచుదమా

క్రిష్ణమ్మ ఉరికేప్రవాహముతో

కరువుకాటకాలను తరిమెదమా


అరకు అందాలదృశ్యాలతో

నల్లమల చక్కదనాలతో

అనంతగిరిశేషాచల లావణ్యాలతో 

పచ్చదనానికి పెద్దపీటవేసెదమా


బాలాజీదేవుని దీవెనలతో

అప్పన్నస్వామి ఆశీర్వాదముతో

భద్రాద్రిరాముని ఆశిస్సులతో

బంగరుభూమిగా మననేలనుమార్చెదమా


ఆలించి పాలించి

అలరించి నమ్మించి

క్షేమాన్ని కాంక్షించి

తెలుగుజాతికీర్తిని చాటుదమా


యాసలనుమరచి

ప్రాంతభేదాలనువీడి

అన్నదమ్ములవలెమెలిగి

అందరిమేలును కోరుదమా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog