ఈర్ష్యాద్వేషాలు


పేరొస్తుంటే

సుబ్బిగాడు ఏడ్చాడు

భారతమ్మ బాధపడింది

శోభమ్మ క్షోభకుగురయ్యింది


ప్రశంసిస్తుంటే

మూతులు బిగుసుకుంటున్నారు

కడుపులు మాడ్చుకుంటున్నారు

మోములు వాడ్చుకుంటున్నారు


పొగుడుతుంటే

వారిస్తున్నారు

చెవులుమూసుకుంటున్నారు

ఈర్ష్యపడుతున్నారు


చప్పట్లుకొడుతుంటే

శాపనార్ధాలుపెడుతున్నారు

బండబూతులుతిడుతున్నారు

చేతులువిరగకొటతామంటున్నారు


ఆకాశానికెత్తుతుంటే

చూడలేకపోతున్నారు

చిన్నబుచ్చుకుంటున్నారు

చిదిమేయాలనుకుంటున్నారు


సన్మానాలుచేస్తుంటే

ఓర్వలేకున్నారు

తిరగబడుతున్నారు

తిట్టిపోస్తున్నారు


సత్కరిస్తుంటే

విమర్శిస్తున్నారు

వివాదముచేస్తున్నారు

వ్యతిరేకిస్తున్నారు


శాలువాలుకప్పుతుంటే

సహించలేకున్నారు

రగిలిపోతున్నారు

కళ్ళుమూసుకుంటున్నారు


బిరుదులిస్తుంటే

ఇవ్వద్దంటున్నారు

అడ్డుకుంటున్నారు

వ్యతిరేకిస్తున్నారు


ఖ్యాతిపొందుతుంటే

కళ్ళల్లో నిప్పులుపోసుకుంటున్నారు

మాటల్లో విషముకక్కుతున్నారు

ద్వేషంతో రగిలిపోతున్నారు


బాగుబాగు అంటుంటే

నోర్లు మెదపొద్దంటున్నారు

గొప్పలు చెప్పొద్దంటున్నారు

మెప్పులు కురిపించ్చొదంటున్నారు


పక్కవారు బాగుపడుతుంటే

చూడలేకపోతున్నారు

ఉడికిపోతున్నారు

భరించలేకున్నారు


ఈర్ష్యా

నిన్ను నలిపేస్తా

కాల్చేస్తా

బూడిదచేసేస్తా


అసూయా

నిన్ను ద్వేషిస్తా

దహించుతా

దండిస్తా


ఓర్వలేనితనమా

నిన్ను తిడతా

తంతా

తగలేస్తా


అందరినీ

ప్రేమను పంచమంటా

మమతలు కురిపించమంటా

మానవత్వమును చాటమంటా


గుండ్లపల్లి రాజంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog