అక్షరాలు
అక్షరాలు
తోడై
వెంటనడుస్తున్నాయి
అక్షరాలు
దివ్వెలై
వెలుగులుచిమ్ముతున్నాయి
అక్షరాలు
పువ్వులై
పరిమళాలువెదజల్లుతున్నాయి
అక్షరాలు
నవ్వులై
మోములనువెలిగిస్తున్నాయి
అక్షరాలు
చినుకులై
వర్షిస్తున్నాయి
అక్షరాలు
పలుకులై
తేనెచుక్కలనుచల్లుతున్నాయి
అక్షరాలు
మిఠాయిలై
తీపినితినిపిస్తున్నాయి
అక్షరాలు
జాబిలై
వెన్నెలనుకురిపిస్తున్నాయి
అక్షరాలు
తారకలై
తళుకుతళుకుమంటున్నాయి
అక్షరాలు
అమృతచుక్కలై
అధరాలనుక్రోలమంటున్నాయి
అక్షరాలు
సత్యాలై
వాస్తవాలనుచూపుతున్నాయి
అక్షరాలు
తీగలై
ప్రాకుతున్నాయి
అక్షరాలు
మొక్కలై
కాయలుకాస్తున్నాయి
అక్షరాలు
ముత్యాలై
సరాలుగాగుచ్చమంటున్నాయి
అక్షరాలు
ఆలోచనలకురూపమై
కవితలవుతున్నాయి
అక్షరాలు
భావాలై
మనసునుహత్తుకుంటున్నాయి
అక్షరాలు
పుటలకెక్కి
పుస్తకాలవుతున్నాయి
అక్షరాలు నాకుతోడు
నేను అక్షరాలకుతోడు
మేము కలసిముందుకునడుస్తాము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment