ఎవరు? వారెవరు?
కవ్విస్తే
ఎవరయినా
రెచ్చిపోయేవారున్నారా
కలమునుపట్టేవారున్నరా
పొగిడితే
ఎవరయినా
పొంగిపోయేవారున్నారా
పదాలనుపొసిగేవారున్నారా
కవిసమ్మేళనానికిపిలిస్తే
ఎవరయినా
పరుగెత్తుకుంటూవెళ్ళేవారున్నారా
పాడిపరవశపరచేవారున్నారా
శాలువాకప్పితే
ఎవరయినా
సంతసపడేవారున్నరా
ధన్యవాదాలుచెప్పేవారున్నారా
కవితనువినిపించమంటే
ఎవరయినా
ముందుకొచ్చేవారున్నారా
మురిపించేవారున్నారా
ఉగాదికైతనువ్రాయమంటే
ఎవరయినా
స్పందించివ్రాసేవారున్నారా
అద్భుతంగావర్ణించేవారున్నారా
అందాలనుచూపమంటే
ఎవరయినా
సరేననిసమ్మతించేవారున్నారా
చక్కగాచూపించేవారున్నారా
ఆనందాలనుపంచమంటే
ఎవరయినా
కైతలను పంపేవారున్నారా
కుతూహలపరచేవారున్నారా
ఎవరు వారు
ఇంకెవరు
కవివర్యులు తప్ప
కల్పనాచతురులు తప్ప
కవి
అల్పసంతోషుడు
మాటలమాంత్రికుడు
అక్షరాల నేతగాడు
కవిబ్రహ్మలను
అలుసుగాచూడొద్దు
అమర్యాదచెయ్యొద్దు
అణచివేయవద్దు
కవులను
ఆదరిద్దాం
వెన్నుతడదాం
గౌరవిద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment