నేను


నేను 

పైకి

పైపైకి 

మరింతపైకిలేస్తా


నన్ను

మాటలతో కాల్చిమసిచేయకండి

చూపులతో ఛిద్రముచేయకండి

ద్వేషంతో దుర్భాషలాడకండి


నాపై

కోపాన్ని చూపకండి

విషాన్ని చిమ్మకండి

నిప్పును విసరకండి


నేను

కడలి కెరటంలా

ఎత్తుకెగిరిపడి

తిరిగి ఎగిసిపడుతా


నేను

తూర్పున సూర్యుడిలా

నిత్యం

ప్రొద్దున్నే ఉదయిస్తుంటా


నేను

చంద్రుని వెన్నెలలా

కురుస్తూ

ఆనందింప జేస్తుంటా


నేను

తాజా పువ్వులా

అందాలుచూపి

పరిమళాలు వెదజల్లుతుంటా


నేను

కరిగిన హిమములా

గంగానదిలా

క్రిందకు ప్రవహించుతుంటా


నన్ను

వక్రీకరించకండి

నాపై

బురదచల్లకండి

అయినా

నిజాలు వెల్లడిస్తుంటా


నన్ను

అనుమానించకండి

నాపై

అభాండాలు వేయకండి

అయినా

అసలువిషయాలు తెలియజేస్తుంటా


నన్ను

దూరంగాపెట్టకండి

నాపై

ధూషణలు గుప్పించకండి

అయినా

అందరికీ చేరువవుతా


నన్ను

కట్టడిచేయకండి

నాపై

బాణాలు సంధించకండి

అయినా

స్వేచ్ఛగా బయటకొస్తా


నన్ను

అపార్ధంచేసుకోకండి

నాపై

నిందలు మోపకండి

అయినా

మనసువిప్పి ముందుంచుతా


నన్ను

కర్రలతోకొట్టకండి

నాపై

మాటలతూటాలు ప్రేల్చకండి

అయినా

తట్టుకొని తలయెత్తుకొనితిరుగుతా


నన్ను

హింసించకండి

నాపై

నిందలు వేయకండి

అయినా

నిజాయితీ నిరూపించుకుంటా


నన్ను

వెలివేయకండి

నాపై

అసత్యాలు ప్రచారంచేయకండి

అయినా

నగ్నసత్యాలు వెల్లడిస్తా


నన్ను

మోసముచేయకండి

నాపై

అభియోగాలు బనాయించకండి

అయినా

కడిగినముత్యంలా బయటికొస్తా


నన్ను

దిగజార్చకండి

నాపై

కల్లబొల్లికబుర్లు కూయకండి

అయినా

మచ్చలేనివాడినని నిరూపించుకుంటా


నన్ను

సమాజహితుడిగాచూడండి

నాపై 

ధీమా ఉంచండి 

తప్పక

సంఘాన్ని బాగుచేస్తా


నన్ను

శ్రేయోభిలాషిగాతెలుసుకోండి

నాపై

నమ్మకాన్ని పెట్టండి

విధిగా

మేలుచేసి అందరినిమురిపిస్తా


నాపై

విశ్వాసముంచండి

నాతో

సహకరించండి


ఎవరో వస్తారని

ఏదో చేస్తారని

ఎదురుచూచి

మోసపోకండి


మనకు

మనమే

మేలుచేసుకుందాం

ముందుకడుగులేద్దాం


నేను

కలం పడతా

గళం విప్పుతా

పయనం సాగిస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog