చెలిసింగారాలు


పొంకమో

పరిమళమో

పువ్వు

పట్టేస్తుంది


అందమో

ఆనందమో

అతివ

ఆకట్టుకుంటుంది


వయసో

వన్నెయో

వనిత

వయ్యారాలొలుకుతుంది


తోషమో

తన్మయత్వమో

తరుణి

తలనుతడుతుంది


చూపును

తిప్పలేకున్నా

మోమును

మరల్చలేకున్నా


పువ్వును

ప్రేయసికొప్పులోగుచ్చుతా

నవ్వును

నెచ్చెలికివినిపిస్తా


చెలిని

లాలిస్తా

ప్రేమను

కురిపిస్తా


అవకాశాన్ని

సద్వినియోగంచేసుకుంటా

అదృష్టానికి

సంబరపడిపోతా


ఆలశ్యం

చేయను

అమృతాన్ని

చేజార్చుకోను


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog