గాలిని నిత్యసంచారిణి


నేను

గాలిని

నిత్య

సంచారిణి


కళ్ళకు

కనబడకుంటా

ఉనికిని

చాటుతుంటా


పిలిస్తే

చిన్నగా

చెంతకు

చేరుతా


ఆహ్వానిస్తే

చల్లగా

మేనును

తాకుతా


నిందిస్తే

స్తంబిస్తా

ఉక్కిరిబిక్కిరి

చేసేస్తా


తిడితే

వేగంగా

వీస్తా

ఇబ్బందిపెడతా


స్వాగతిస్తే

సుగంధాలు

పట్టుకొస్తా

పరవశపరుస్తా


గౌరవిస్తే

సంబరపడుతా

పరిసరాలను

పరిశుభ్రపరుస్తా


ద్వేషిస్తే

ఉగ్రరూపందాలుస్తా

ఇల్లనుచెట్లను

కూల్చిపారేస్తా


ప్రేమిస్తే

పరుగెత్తుకుంటూవస్తా

ప్రాణవాయువును

గుండెలకందిస్తా


ధూషిస్తే

మబ్బులనుతేలుస్తా

వానలుకురిపిస్తా

వరదలుపారిస్తా


విమర్శిస్తే

సుడులుతిరుగుతా

ధూళినిలేపుతా

దుమ్మునుకళ్ళల్లోచల్లుతా


పూజిస్తే

ప్రసన్నుడనవుతా

ప్రశాంతతకలిపిస్తా

ప్రమోదపరుస్తా


తలలుతాకి

ఆలోచనలుపారిస్తా

తరంగములయి

ఆలాపనలువినిపిస్తా


నిరంతరం

ప్రసరిస్తుంటా

నిత్యం

పయనిస్తుంటా


మానవులకు

తోడుగుంటా

మదులను

మురిపిస్తుంటా


సోకుతూ

సంచరిస్తుంటా

తడుతూ

తిరుగుతుంటా


నాకు

సరిహద్దులులులేవు

పరిమితులులేవు

వంకలులేవు

ఆటంకాలులేవు


నాకు

దిక్కులులేవు

రహస్యాలులేవు

బంధుత్వాలులేవు

సంకెళ్ళులేవు


నేనే

గాలిని

చిరుగాలిని

వడిగాలిని

సుడిగాలిని


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog