తెంచుకోలేని ప్రేమ


కవిత

కవ్వింపులకుదిగింది

వ్రాత

సాగించమంటుంది


గాలి

హోరుగావీస్తుంది

వాన

జోరుగాకురుస్తుంది


తుఫాను

తరుముకొస్తుంది

కడలి

కల్లోలమయ్యింది


కల

గుర్తుకొస్తున్నది

స్మృతి

వదలకున్నది


కధ

చివరకురాకున్నది

కంచికి

చేరవేయమంటున్నది


ఆరంభం

అదిరిపోయింది

అంతం

చేరుకోమంటుంది


తేనెతుట్టె

కదిలింది

తేనెటీగలను

లేపింది


దారి

రమ్మంటున్నది

అడుగులు

వేయమంటున్నది


చేయి

సాగుతున్నది

పని

జరగుతున్నది


ఊహలు

వెంటబడుతున్నాయి

ఉల్లము

ఉరకమంటున్నది


కధ

ముగింపులేనిదయింది

కల

మరవనీయనిదయింది


కళ్ళు

మూతబడకున్నవి

చెవులు

నిక్కరించుకున్నవి


ప్రేమ

తగ్గకున్నది

భ్రమ

తొలగకున్నది


కవిత

దోరబుచ్చుకున్నది

ప్రేమబంధము

తెగిపోనిదయ్యింది


అది

గాలికాదు కవనపయనం

అది

వానకాదు కవితలవర్షం


అది

ప్రేమకాదు సాహితీప్రణయం

అవి

సంకెళ్ళుకావు కవిత్వబంధం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog