సమయం సందర్భం


మీ

సమయం

తీసుకునేదాకొంచెం

సందర్భం

తెలియజేసేదాస్వల్పం


నాకు

సమయం

దొరికింది

సందర్భం

కుదిరింది


నేటి 

సమయం

ఉదయం

సందర్భం

ఆదివారం


ఇప్పుడు

కవిత్వం

కూర్చేసమయం

కుతూహలం

కలిగించేసందర్భం


కలలకు

రూపమిచ్చేసమయం

కల్పనలను

కళ్ళముందుంచేసందర్భం


అందాలను

వర్ణించేసమయం

ఆనందాలను

పంచిపెట్టేసందర్భం


సూర్యోదయాన్ని

దర్శించేసమయం

జనాన్ని

మేలుకొలిపేసందర్భం


పువ్వులు

పూచేసమయం

పూజలు

చేసేసందర్భం


ప్రార్ధనలు

చేసేసమయం

వరాలను

కోరేసందర్భం


సమయం

మించను

సందర్భం

వదలను


సమయం

సద్వినియోగపరుస్తా

సందర్భం

సవివరంగాతెలియజేస్తా


సమయానుసారం

మాట్లాడుతా

సందర్భానుసారం

నడుచుకుంటా


సమయోచితంగా

ప్రవర్తిస్తా

సందర్భోచితంగా

వ్యాఖ్యానిస్తా


సమయపాలన

పాటిస్తా

సందర్భపాలన

చూపిస్తా


సమయం

కలిసొచ్చింది

సందర్భం

అనుకూలించింది


సమయస్ఫూర్తి

కలిగిస్తా

సందర్భస్పృహని

ఎరిగిస్తా


సమయం

ఇచ్చినందుకు ధన్యవాదాలు

సందర్భం

కలిసొచ్చినందుకు కృతఙ్ఞతలు


గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog