భువిని దివినిచేద్దాం
భువిని
దివినిచేద్దామురా
సుఖాలని
స్వంతంచేసుకుందామురా
మంచిమాటలు చెప్పనా
మేటిపనులను చేయమననా
మొక్కలను పెంచరా
మహిని పచ్చపరచరా
పువ్వులను పూయించరా
పొంకాలు చూపించరా
వెలుగులు వెదజల్లరా
తమసును తరిమెయ్యరా
పరిమళాలు చల్లరా
పరిసరాలు పులకించరా
చిరునవ్వులు చిందించరా
మోములను వెలిగించరా
తేనెచుక్కలు చల్లరా
తీపిపలుకులు వినిపించరా
అమృతజల్లులు కురిపించరా
అధరాలను క్రోలుకోమనరా
శక్రిసామర్ధ్యాలు చూపరా
యుక్తిచేష్టలను చెయ్యరా
మంచితనమును చూపరా
మానవత్వమును చాటరా
మదులను ముట్టరా
హృదులను తట్టరా
చక్కదనాలను చూపరా
సంతసాలను కలిగించరా
ఈర్ష్యాద్వేషాలు విడువరా
కక్షకార్పణ్యాలు వదలరా
మమతనురాగాలను చూపించరా
మానవబంధాలను వృద్ధిచెయ్యరా
మనసులను సృజించరా
మానవులను మురిపించరా
భూలోకమును స్వర్గముగాచేద్దామురా
మనుజలను సురలుగామారుద్దామురా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment