ఉందిలే మంచికాలం
అనుకున్నవి
జరగలేదని
అలమటించకు
అనుకోనివి
జరిగాయని
హాతాశుడవుకాకు
కష్టాలు
వచ్చాయని
కలతచెందకు
నష్టాలు
ప్రాప్తించాయని
నిరాశపడకు
గుండెను
నిబ్బరించి
దిటువుచేసుకో
మదికి
నచ్చచెప్పి
దారికితెచ్చుకో
మంచిరోజులు
వస్తాయని
ఎదురుచూడు
ఎండినచెట్లు
చిగురిస్తాయని
తెలుసుకో
మారాకులుతొడిగి
మొక్కలు
మళ్ళీపూస్తాయని గుర్తించుకో
చీకటినితరిమి
వెలుగు
విస్తరించక మానదనుకో
ఆశలు
తప్పక తీరుతాయని
ప్రతీక్షించు
కోర్కెలు
సిద్ధిస్తాయని
కాచుకోనియుండు
పాత అనుభవాలను
మరచిపో
కొత్త అనుభూతులను
తలచుకో
చేదు
ఙ్ఞాపకాలను
చెడిపెయ్యి
తీపి
కబుర్లకు
తెరతియ్యి
ఉందిలే మంచికాలము
ముందుముందునని
ఎరిగి మసులుకో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment