ఏమిపని?
తోడుకోసం
వెదకవలసిన పనిఏమున్నది?
అప్సరస
స్వర్గలోకంనుండి చెంతకుచేరినపుడు
బుగ్గలకు
పౌడరుతోపని ఏమున్నది?
సిగ్గులు
ఎర్రరంగును పులిమినప్పుడు
అధరాలకు
త్రాగవలసినపని ఏమున్నది?
అమృతజల్లులు
అడగకుండా అందినపుడు
ఇంటికి
దీపంతోపని ఏమున్నది?
మోములు
చిరునవ్వులు చిందుచున్నప్పుడు
కళ్ళను
మూసుకోవలసినపని ఏమున్నది?
కమ్మదనాలు
కనువిందు చేస్తున్నపుడు
నిశరాత్రి
నిద్రతోపని ఏమున్నది?
నెరజాణ
నీప్రక్కనే ఉన్నప్పుడు
రుచికి
మిఠాయిలతోపని ఏమున్నది?
చెలిపలుకులు
తేనెచుక్కలను చిమ్ముతున్నప్పుడు
గంధం
పూచుకోవలసినపని ఏమున్నది?
మల్లెపూలు
చెలికొప్పులో ఘుమఘుమలాడుతున్నప్పుడు
చెలిని
చేజార్చుకోవలసినపని ఏమున్నది?
సదుపాయాలు
చక్కగా అందిస్తున్నప్పుడు
కవితకోసం
కాచుకొనేపని ఏమున్నది?
ఆలోచనలు
అంతరంగాన్ని అంటినప్పుడు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment