కవితలంటే?


మనసులో మెరుపులు

కలము కదలికలు

కాగితాల్లో కూర్పులు

కవితలు


తోటలో విరబూసినపువ్వులు

రంగుల సీతాకోకచిలుకలు

ఎగురుతున్న తూనీగలు

కవితలు


నింగిలోని నిండుచంద్రుడు

వెన్నెల చల్లదనాలు

కన్నుల కమ్మదనాలు

కవితలు


వాన చినుకులు

పారు నదులు

కడలి కెరటాలు

కవితలు


చెరకు రసాలు

మామిడి ఫలాలు

తియ్యని జిలేబీలు

కవితలు


ఊహల పరుగులు

హృది స్పందనలు

మది పొంగులు

కవితలు


అమృత చుక్కలు

సుమ సౌరభాలు

కాంతి కిరణాలు

కవితలు


అక్షర ముత్యాలు

గుచ్చిన సరాలు

దాల్చిన కంఠాలు

కవితలు


మాటలుకట్టిన  మూటలు

పెదాలుప్రేల్చిన తూటాలు

కవులుచెప్పెడి పాఠాలు

కవితలు


కవితలు

చదవండి

ఆనందించండి

కవులనుతలవండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog