కొన్నిసార్లు
కొన్నిసార్లు
కొంతమంది కొత్తవ్యక్తులు
తారసపడి తన్మయపరచి
జీవితాంతం తోడుగానిలిచిపోతారు
కొన్నిసార్లు
కొన్ని కలలొచ్చి
నిద్రనుండిలేపి
కొన్ని అనుభూతులుకలిగిస్తాయి
కొన్నిసార్లు
అందాల హరివిల్లు
వాననుతరిమేసి సప్తవర్ణాలలో
ఆకాశంలోదర్శనమిచ్చి సంతసమిస్తాయి
కొన్నిసార్లు
గడుసరి తేనెటీగలు
పూతేనెను తస్కరించి
తుట్టెలోదాచుకొని సంబరపరుస్తాయి
కొన్నిసార్లు
మొగ్గగాపుట్టి వికసించి
పూలు పొంకాలుచూపి
పరిమళాలువెదజల్లి ప్రమోదపరుస్తాయి
కొన్నిసార్లు
పెదాల నవ్వులుపుట్టి
తలను తట్టి
మోమును వెలిగిస్తాయి
కొన్నిసార్లు
మనసులో ఊహలుమెరిసి
మాయమయిపోయి
కవితలను వ్రాయిస్తాయి
కొన్ని క్షణాలు
కొన్ని సార్లు
కొన్ని రహాస్యాలుచూపించి
కొన్నిపనులను చేయిస్తాయి
కొన్ని
మంచి క్షణాలకోసం
ఓపికగా ఎదురుచూస్తూ
కాలముగడుపుదాము జీవితాన్ననుభవిద్దాము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment