చెలిసొగసులు
దాని గాజులు గల్లుగల్లు మంటుంటే
దాని గజ్జెలు ఘల్లుఘల్లు మంటుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని కాటుకకళ్ళు కవ్విస్తుంటే
దాని ఎర్రనిపెదవులు రమ్మంటుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని పలుకులు తేనెచుక్కలు చల్లుతుంటే
దాని కులుకులు ఒయ్యారాలు ఒలుకుతుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని చిరునవ్వులు మోమును వెలిగిస్తుంటే
దాని తలపువ్వులు సువాసనలు చల్లుతుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని నడుము అటునిటు ఊగుతుంటే
దాని రూపము కళకళ లాడుతుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని సరసాలు సంబరపరుస్తుంటే
దాని వేషాలు మరులుకొలుపుతుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని నగలు ధగధగ లాడుతుంటే
దాని కురులు గాలికి ఎగురుతుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని తెల్లనిరంగు వెలుగుతుంటే
దాని ఎర్రనిబుగ్గలు సిగ్గులొలుకుతుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని అడుగులు హంసను తలపిస్తుంటే
దాని పరుగులు జింకను గుర్తుకుతెస్తుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని పొంగులు పరవశపరుస్తుంటే
దాని హంగులు ఆకర్షిస్తుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని పిలుపులు ప్రేమను కురిపిస్తుంటే
దాని తలపులు తలను తడుతుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
దాని గాజులు గల్లుగల్లు మంటుంటే
దాని గజ్జెలు ఘల్లుఘల్లు మంటుంటే
లాగేస్తున్నది దాని సొగసు
మురిసిపోతుంది నా మనసు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment