షడ్రుచుల పచ్చడికోసం
ఉగాదిపండుగ వచ్చిందని
ఉగాదిపచ్చడిని తినాలని
ఉబలాటపడి
ఉత్సాహంగా ఎదురుచూశా
సంవత్సరాది
శుభాలపండుగని
సంబరపడి
సూర్యోదయాన్నేలేసి స్నానముచేశా
వేపపూతకోసమని
పూచినచెట్టుకోసమని
వెతికివెతికి పట్టుకొని
కోసుకొని ఇంటికితీసుకొచ్చా
మామిడికాయలకోసమని
మైలుదూరముతిరిగి
ఖరీదయినా సరేనని
రెండుకాయలు కొనుక్కొనివచ్చా
లేతపచ్చి మిరపకాయలుకొని
ఇంటికి పట్టుకొచ్చి
సన్నసన్నముక్కలుగా తరగమని
ఆదేశాలిచ్చా
కొత్తచింతపండునుకొని
నీళ్ళలో నానబెట్టించి
గుజ్జును తియ్యమని
పురమాయించా
ఉప్పులేనిపదార్ధము వ్యర్ధమని
చప్పదనమునుపోగొట్టాలనిచెప్పి
ఓ పొట్లాము ఉప్పునుతెచ్చి
భార్యామణిచేతికిచ్చా
ఉత్సాహపరచి
ఉద్వేగపరచి
ఉగాదిపచ్చడిని
ఉత్తమంగా చేయించా
అందరంకలసి
పూజలుచేసి
ఉగాదిపచ్చడినితిని
పరవశించాం
సంవత్సరమంతా
షడ్రుచులపచ్చడి
సంతోషమిస్తుందని
చూపుతుందనిమహత్యం ఎగిరిగంతులేశా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అందరికీ ఉగాది శుభాకాంక్షలు
Comments
Post a Comment