పిలుపులు


ఆకాశమునుండి

పిలుపులొస్తున్నాయి

తలయెత్తిచూడమని

తారాచంద్రులకాంచమని


గాలినుండి

కబుర్లొస్తున్నాయి

ప్రక్కకురమ్మని

కలసిపయనిద్దామని


పూదోటనుండి

పిల్పులొస్తున్నాయి

త్వరగారమ్మని

తోడుగానిలువమని


హృదయంనుండి

అభ్యర్ధనలందుతున్నాయి

ప్రేమజల్లులుచిందమని

ప్రమోదపరచమని


ఆలోచనలనుండి

విన్నపాలొస్తున్నాయి

అందమైనకైతలని

అద్భుతంగావ్రాయమని


అక్షరాలనుండి

ఆహ్వానాలొస్తున్నాయి

కలమునుపట్టమని

కవితలనల్లమని


పదాలనుండి

స్వాగతాలందుతున్నాయి

ప్రయోగించమని

భావాలువ్యక్తపరచమని


పాఠకులనుండి

వినతులొస్తున్నాయి

ప్రణయకవితలనురాయమని

పారవశ్యంలోముంచమని


పిలుపులను

ఆలకిస్తా

స్పందనలను

స్పష్టముచేస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog