తెలుగోడా!
నన్నయ్య బాటన
నడవవేమిరా
నాణ్యమైనది తెలుగని
నినదించవేమిరా
తిక్కన తెరువున
పయనించవేలరా
తెలుగు తియ్యందనాలను
పంచిపెట్టవేలరా
పొతన దారిని
అనుసరించవేమిరా
నలుదిక్కులా తెలుగుని
ప్రసరించవేమిరా
శ్రీనాధుని కావ్యాలను
స్మరించవేమిరా
తెలుగోళ్ళ మనసులను
దోచుకొనవేమిరా
రాయలు మాటలను
ప్రచారంచేయవేమిరా
తెలుగు దేశానలెస్సని
పలుకవేమిరా
శ్రీశ్రీలాగా
కమ్మనికవితలనుకూర్చవేమిరా
తెలుగు వెలుగని
తెలుపవేమిరా
విశ్వనాధవలె
విరచించవేమిరా
విశ్వమంతా తెలుగును
విస్తరించవేమిరా
కృష్ణశాస్త్రిని
తలచవేమిరా
భావకవితలను తెలుగులో
బహుగావ్రాయవేమిరా
దాశరధి రీతిన
రాయవేమిరా
దశదిశల తెలుగుకు
సాటిలేదనవేమిరా
సినారె పాటలను
పాడవేమిరా
శ్రావ్యమైనది తెలుగని
చాటవేమిరా
ఎక్కడున్నా ఎప్పుడైనా
తెలుగుతల్లిని తలచరా
కలముపట్టి గళమునెత్తి
తెలుగుఘనతను తెలుపరా
జైజై
తెలుగనరా
జయహో
తెలుగనరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment