నేటి ఎన్నికలచిత్రం
భానుదు
భగభగామండుతున్నాడు
వడగాల్పులు
ఎడాపెడా వీస్తున్నాయి
పచ్చనోట్లు
రెపరెపలాడుతున్నాయి
బిరియానిపొట్లాలు
చకచకాపంచబడుతున్నాయి
మధ్యము
గలగలా ఏరులాపారుతుంది
ఓటర్లు
గజగజలాడిస్తున్నారు
నేతలు
విలవిలాపోతున్నారు
ఎన్నికలు
చకచకాముంచుకొచ్చాయి
అవినీతి
రాజ్యమేలుతుంది
అక్రమాలు
చోటుచేసుకుంటున్నాయి
జయాపజయాలు
దైవాధీనమయ్యాయి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment