ఎట్లా?
కవిత
కవ్వించకపోతే
కోరకపోతే
కవనంసాగేది ఎట్లా?
కలం
కదలకపోతే
కక్కకపోతే
గీయకపోతే ఎట్లా?
కాగితం
నల్లబడకపోతే
నిలబడకపోతే
నిండకపోతే ఎట్లా?
గళం
విప్పుకోకపోతే
వినిపించకపోతే
విరామంతీసుకుంటే ఎట్లా?
ఊహలు
ఊరకపోతే
ఉరకకపోతే
ఉత్తేజపరచకపోతే ఎట్లా?
అక్షరాలు
అల్లుకోకపోతే
అందకపోతే
అమరకపోతే ఎట్లా?
పదాలు
పొసగకపోతే
పారకపోతే
పుటలకెక్కకపోతే ఎట్లా?
కవితలు
కూరకపోతే
చేరకపోతే
చదవకపోతే ఎట్లా?
పాఠకులు
పఠించకపోతే
ప్రతిస్పందించకపోతే
పరవశించేది ఎట్లా?
మనసులు
మురిసిపోకపోతే
మెరిసిపోకపోతే
మనేది ఎట్లా?
కవులు
కదలకపోతే
కదంత్రొక్కకపోతే
కవితలుపుట్టేది ఎట్లా?
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment