మహలక్ష్మి రావమ్మా!


రావమ్మా రావమ్మా

మహాలక్ష్మి రావమ్మా

మా ఇంటికిరావమ్మా

మమ్మూ కరుణించవమ్మా                    ||రావ||


నిత్యము పూజిస్తామమ్మా

సత్యము పలుకుతామమ్మా

ప్రదక్షణలు చేస్తామమ్మా

ప్రసాదాలు పంచుతామమ్మా


తలుపులు తెరుస్తామమ్మా

స్వాగతము పలుకుతామమ్మా

త్వరగా త్వరత్వరగారావమ్మా

తరలిపోక నిలిచిపోవమ్మా                     ||రావ||    


చిల్లరను చల్లవమ్మా

వేలను కూర్చవమ్మా

లక్షలను పేర్చవమ్మా

కోట్లను కుమ్మరించవమ్మా


గాజులు గలగలలాడించవమ్మా

గజ్జలు ఘల్లుఘల్లునమ్రోగించవమ్మా

నవ్వులను నిండుగాచిందించవమ్మా

మోములను చక్కగావెలిగించవమ్మా               ||రావ||


కాంతులను ప్రసరించవమ్మా

చీకట్లను పారద్రోలవమ్మా

పరిమళాలు వెదజల్లవమ్మా

పరవశాలు కలిగించవమ్మా


ధన్యవాదాలు చెబుతామమ్మా

దినదినము పూజించుతామమ్మా

దర్శనభాగ్యము కలిగించమ్మా

ధనమును చేతులనిండాచేకూర్చవమ్మా              ||రావ||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog