ఆంధ్రానాటకం
(చాల్లే బడాయి)
నేను ఉన్నాకాబట్టే
ఉచితాలు ఇస్తున్నా
డబ్బులు పంచుతున్నా
సంక్షేమం చేస్తున్నా
కడుపులు నింపుతున్నా
ప్రాణాలు కాపాడుతున్నా
నేను చెబితేనే
మేఘాలు లేచాయి
వానలు కురిసాయి
పొలాలు తడిసాయి
పైరులు పెరిగాయి
పంటలు పండాయి
నేను కోరితేనే
మొక్కలు మొలిచాయి
మొగ్గలు తొడిగాయి
పువ్వులు పూచాయి
పరిమళాలు చల్లాయి
పరవాశాలు పంచాయి
నేను కలంపట్టమంటేనే
కాగితాలు నిండాయి
కవితలు పుట్టాయి
అందాలు చూపాయి
ఆనందాలు ఇచ్చాయి
అంతరంగాలను తట్టాయి
నేను ఉన్నాననే
ఓటర్లు పోటెత్తారు
మీటను నొక్కారు
గెలుపును ఇస్తున్నారు
ప్రత్యర్ధులను ఎదురిస్తున్నారు
అధికారాన్ని ఒప్పచెబుతున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment