వడగాల్పులవీరంగం


సుగంధాలు

చల్లుతాయనుకున్నసుమాలు

వాడిపోయాయి

రాలిపోయాయి


కౌముది

కురిపిస్తుందనుకున్నజాబిలి

దడుసుకున్నది

దాక్కున్నది


చినుకులు

చిటపటారాలుస్తాయనుకున్నమేఘాలు

చిన్నబోయాయి

చెల్లాచెదురయ్యాయి


చిగురాకులు

తొడుగుతాయనుకున్నచెట్లు

ఎండిపోయాయి

విలవిలలాడుతున్నాయి


గళాలు

విప్పుతాయనుకున్నకోకిలలు

మూగబాటపట్టాయి

గొంతులుతెరవకున్నాయి


నాట్యాలు

చేస్తాయనుకున్ననెమలులు

నివ్వెరపోయాయి

నీడల్లోనిలిచిపోయాయి


నవ్వులు

విసురుతాయనుకున్నమోములు

నల్లబడ్డాయి

నీరసపడ్డాయి


నిజాలు

అవుతాయనుకున్నకలలు

కరిగిపోయాయి

కల్లలయ్యాయి


వడగాల్పులు

వీరంగంసృష్టిస్తున్నాయి

వీధులనుఖాళీచేస్తున్నాయి

వాకిటితలుపులనుమూయిస్తున్నాయి


ఎన్నో అడగాలనుకున్నా

పువ్వులను, వెన్నెలను,

చినుకులను, చిగురాకులను,

కోకిలలను, కలాపీలను,

నవ్వులను, నిమిషాలను


కానీ

కళ్ళుతెరచిచూచి

విచారినయ్యా

బైరాగినయ్యా

మౌనినయ్యా


కష్టాలు

కాంచినపిమ్మట

కదిలిపోయా

క్రుంగిపోయా

కవితనుకూర్చా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog